'నా సామిరంగ'... నాగార్జున కొత్త చిత్రం టీజర్ రిలీజ్!

  • నాగార్జున, ఆషికా రంగనాథ్ జంటగా 'నా సామిరంగ'
  • కీలకపాత్రల్లో అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ 
  • ఆసక్తికరంగా టీజర్
  • సంక్రాంతి కానుకగా వస్తున్న 'నా సామిరంగ'
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, ఆషికా రంగనాథ్ జంటగా కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'నా సామిరంగ'. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ రిలీజ్ చేశారు. కథ మొత్తం పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందని టీజర్ ద్వారా తెలుస్తోంది. ఈ టీజర్ లో నాగార్జున, ఆషికా రంగనాథ్, అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ పాత్రల గురించే చూపించారు. నాగార్జున హీరోయిజం గురించి ఆషికా రంగనాథ్... అల్లరి నరేశ్ ను అడగడం... అతడు నాగార్జున గురించి చెప్పడం... టీజర్ లో మెయిన్ కంటెంట్ ఇదే. 

'నా సామిరంగ' చిత్రంలో మిర్నా మీనన్, రుక్సార్ థిల్లాన్ కూడా నటించారు. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి 'నా సామిరంగ' వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

Nagarjuna
Naa Saamiranga
Teaser
Ashika Ranganath
Allari Naresh
Raj Tarun
Vijay Binny
Srinivasa Chitturi

More Telugu News